Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మతబోధకులకు గ్రామస్తుల దేహశుద్ధి... వీడియో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy shares an interesting video
Advertisement
  • సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి
  • ఓ గ్రామానికి వెళ్లిన మిషనరీలు
  • మతబోధ చేసేందుకు యత్నం... వికటించిన వైనం
  • చేతులు, చెప్పులకు పనిచెప్పిన గ్రామస్తులు
Advertisement
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఎక్స్ లో ఆసక్తికర వీడియో పంచుకున్నారు. కొందరు వ్యక్తులకు గ్రామస్తులు దేహశుద్ధి చేస్తుండడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వ్యక్తులు చేతులు జోడించి దండాలు పెడుతున్నా గానీ, ఆ గ్రామస్తులు పట్టించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో వారిపై చెప్పులతో దాడికి దిగారు. ఆ వీడియో గురించి విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. మిషనరీలు (మతబోధకులు)గా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఓ గ్రామానికి వెళ్లి మత బోధ చేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. కానీ వారికి సదరు గ్రామస్తుల నుంచి అనూహ్యరీతిలో స్పందన ఎదురైందని తెలిపారు. విష్ణు పంచుకున్న వీడియో పట్ల నెటిజన్లు కూడా తలోరకంగా స్పందిస్తున్నారు.
Advertisement
Advertisement
Vishnu Vardhan Reddy
Video
Missonaries
Villagers
BJP
Andhra Pradesh

More Telugu News